Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో!

25 May, 2022 15:35 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ వైస్‌ కెప్టెన్‌(రషీద్‌ ఖాన్‌)

గుజరాత్‌ టైటాన్స్‌ ట్వీట్‌.. రషీద్‌ ఖాన్‌ ఫన్నీ రిప్లై

IPL 2022 GT Enters Final: ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టి ఫైనల్లో అడుగుపెట్టింది గుజరాత్‌ టైటాన్స్‌. క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో గుజరాత్‌ ఆటగాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ విజయాలను ఆస్వాదిస్తూ సంతోషంగా అహ్మదాబాద్‌కు పయనమవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా మరో కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం(మే 25) పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌... క్వాలిఫైయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఎలిమినేటర్‌ విజేత, రాజస్తాన్‌ మధ్య మే 27న మ్యాచ్‌ జరుగుతుంది. ఇక ఇందులో గెలిచిన జట్టు గుజరాత్‌తో ఫైనల్లో పోటీ పడుతుందన్న సంగతి తెలిసిందే. మే 29న ఈ మెగా పోరు జరుగనుంది.

ఈ నేపథ్యంలో విజయోత్సాహంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ తనదైన శైలిలో ట్వీట్‌ వదిలింది. #LateNightThoughts అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ‘‘నాలుగు రోజులు సెలవులు దొరికాయి. ఏం చేయాలో?’’ అంటూ కామెంట్‌ చేసింది. ఇక ఇందుకు స్పందించిన గుజరాత్‌ వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌.. ‘‘నిద్ర పో’’ అంటూ స్మైలీ ఎమోజీలతో బదులిచ్చాడు. ఈ ట్వీట్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు
👉🏾టాస్‌- గుజరాత్‌
👉🏾రాజస్తాన్‌ రాయల్స్‌- 188/6 (20)
👉🏾గుజరాత్‌ టైటాన్స్‌- 191/3 (19.3)
👉🏾7 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం
👉🏾ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ మిల్లర్‌(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్‌)
👉🏾ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా 27 బంతుల్లో 40 పరుగులు నాటౌట్‌.. అదే విధంగా 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ పడగొట్టాడు.

చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!
చదవండి👉🏾IPL 2022 Eliminator LSG Vs RCB: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం వాళ్లదే.. కారణమిదే: టీమిండియా మాజీ క్రికెటర్‌

>
మరిన్ని వార్తలు