IPL 2023: ఉత్కంఠ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ విజయం

16 Apr, 2023 00:28 IST|Sakshi

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సికందర్‌ రజా 41 బంతుల్లో 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. మాథ్యూ షార్ట్‌ 34 పరుగులు చేశాడు. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి షారుక్‌ ఖాన్‌ తన స్మార్ట్‌ ఇన్నింగ్స్‌తో(10 బంతుల్లో 23 నాటౌట్‌) పంజాబ్‌ను గెలిపించాడు. లక్నో బౌలర్లలో మార్క్‌వుడ్‌, యుద్వీర్‌ సింగ్‌, రవి బిష్ణోయి తలా రెండు వికెట్లు తీశారు.

కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్‌ ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. సికందర్‌ రజా 50 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ కింగ్స్‌
లక్ష్య చేధనలో పంజాబ్‌ కింగ్స్‌ తడబడుతుంది. తాజాగా 82 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ నష్టపోయింది. 22 పరుగులు చేసిన హర్‌ప్రీత్‌ సింగ్‌ కృనాల్‌ బౌలింగ్‌లో యుద్విర్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సికందర్‌ రజా 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

టార్గెట్‌ 160..8 ఓవర్లలో పంజాబ్‌ 53/3
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ 9, సికందర్‌ రజా 4 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

పంజాబ్‌ కింగ్స్‌ టార్గెట్‌ 160
పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 74 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో  కైల్‌ మేయర్స్‌ 29, కృనాల్‌ పాండ్యా 18 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబాడ రెండు, సికందర్‌ రజా, హర్‌ప్రీత్‌ బార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website
Photo Credit : IPL Website

కేఎల్‌ రాహుల్‌(74) ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన లక్నో
కేఎల్‌ రాహుల్‌(74) అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో నాథన్‌ ఎల్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో
కగిసో రబడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బతీశాడు. తొలుత కృనాల్‌ పాండ్యాను ఔట్‌ చేసిన రబాడా.. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌ను గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

కేఎల్‌ రాహుల్‌ ఫిఫ్టీ.. లక్నో 106/2
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ తొలి ఫిఫ్టీ సాధించాడు. 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్‌ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
దీపక్‌ హుడా రూపంలో లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. సికందర్‌ రజా బౌలింగ్‌లో హుడా ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 36, కృనాల్‌ పాండ్యా ఐదు పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో
29 పరుగులు చేసిన కైల్‌ మేయర్స్‌ హర్‌ప్రీత్‌ బార్‌ బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం లక్నో వికెట​ నష్టానికి 57 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

దంచికొడుతున్న లక్నో..
పంజాబ్‌తో మ్యాచ్‌ లక్నో ఘనంగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 27, కేఎల్‌ రాహుల్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.


​​​​​​​Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్ 16వ సీజ‌న్ 21వ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, పంజాబ్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ దూరంగా ఉండడంతో సామ్ క‌ర‌న్ స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్‌కీపర్‌), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కుర్రాన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

మూడు విజ‌యాల‌తో జోరు మీదున్న ల‌క్నో మ‌రో గెలుపుపై క‌న్నేసింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో హైద‌రాబాద్, గుజ‌రాత్ టైట‌న్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ స‌త్తా చాటాల‌ని భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు