యువతులే అతడి టార్గెట్‌.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్‌ బ్యాచిలర్‌.. | Sakshi
Sakshi News home page

యువతులే అతడి టార్గెట్‌.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్‌ బ్యాచిలర్‌..

Published Sat, Apr 15 2023 7:26 PM

Rich Bachelor Cheated Women For Lakhs On Matrimonial Site - Sakshi

ధనవంతుడిలా కటింగ్‌ ఇచ్చాడు ఓ కన్నింగ్‌ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్‌ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్‌ బ్యాచ్‌లర్‌గా కలరింగ్‌ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్‌లోని ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్‌ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్‌ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్‌సైట్లను టార్గెట్‌ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్‌ బ్యాచిలర్‌లా ఫ్రొఫైల్‌ సెట్‌ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్‌ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్‌ బిల్డప్‌ ఇచ్చేశాడు. యువతి టచ్‌లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్‌ నెంబర్‌లు బ్లాక్‌ చేసి దూరంపెట్టేవాడు.

అయితే, తాజాగా విశాల్‌ మ్యాట్రిమోనీ ప్రోఫైల్‌ చూసి పెళ్లి విషయమై గుర్గావ్‌కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్‌ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్‌నెస్‌ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్‌ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్‌ఫోన్స్‌ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్‌, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్‌లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. 

కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్‌కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్‌ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్‌ ఆపరేషన్‌ చేపించి విశాల్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్‌ బ్యాచిలర్‌ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్‌ తిన్నారు. 

Advertisement
Advertisement