IPL 2024 Auction Updates: రిలీ రొస్సోకు జాక్‌పాట్‌

19 Dec, 2023 10:49 IST|Sakshi

గస్‌ అట్కిన్సన్‌ను కేకేఆర్‌ కోటి రూపాయలకు సొంతం చేసుకుంది.

సౌరవ్‌ చౌహాన్‌ను ఆర్సీబీ 20 లక్షలకు దక్కించుకుంది.

షాయ్‌ హోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ 75 లక్షలకు దక్కించుకుంది. 

స్వస్తిక్‌ చిక్కరను ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 లక్షలకు సొంతం చేసుకుంది. 

నండ్రే బర్గర్‌ను 50 లక్షలకు దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్‌

రిలీ రొస్సోను 8 కోట్లకు దక్కించుకున్న పంజాబ్‌ కింగ్స్‌.

లోకీ ఫెర్గూసన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ.

ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను 2 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్‌.

మొహమ్మద్‌ నబీని 1.5 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌.

మనీశ్‌ పాండేను 50 లక్షలకు దక్కించుకున్న కేకేఆర్‌.

జమ్మూ పేసర్‌ రసిక్‌ దార్‌ సలామ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 లక్షలకు దక్కించుకుంది. 

ఆకాశ్‌ సింగ్‌ను సన్‌రైజర్స్‌ 20 లక్షలకు దక్కించుకుంది. 

అన్‌క్యాప్డ్‌ జార్ఖండ్‌ పేసర్‌ సుశాంత్‌ మిశ్రాను గుజరాత్‌ టైటాన్స్‌ 2.2 కోట్లకు సొంతం చేసుకుంది. 

రికీ భుయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 లక్షలకు దక్కించుకుంది. 

రమన్‌దీప్‌ సింగ్‌ను కేకేఆర్‌ 20 లక్షలకు దక్కించుకుంది. 

షారుక్‌ ఖాన్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 7.4 కోట్లకు సొంతం చేసుకుంది. 

చేతన్‌ సకారియాను కేకేఆర్‌ 50 లక్షలకు సొంతం చేసుకుంది.  

రాబిన్‌ మింజ్‌ అనే అన్‌క్యాప్డ్‌ వికెట్‌కీపర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది.

సుమిత్‌ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కోటి రూపాయలకు దక్కించుకుంది. 

తమిళనాడు స్పిన్నర్‌ మణిమారన్‌ సిద్దార్థ్‌ను లక్నో 2.4 కోట్లకు దక్కించుకుంది. 

పంజాబ్‌ కింగ్స్‌ ప్రిన్స్‌ చౌదరీ అనే ఆటగాడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది.

జతవేద్‌ సుబ్రమన్యన్‌ అనే ఆటగాడిని సన్‌రైజర్స్‌ 20 లక్షలకు దక్కించుకుంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ డేవిడ్‌ విల్లేను 2 కోట్లకు దక్కించుకుంది. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆస్టన్‌ టర్నర్‌ను కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. 

షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ను కేకేఆర్‌ 1.5 కోట్లకు దక్కించుకుంది. 

స్పెన్సర్‌ జాన్సన్‌ను 10 కోట్ల భారీ ధరకు గుజరాత్‌ టైటాన్స్‌ హస్తగతం చేసుకుంది.

జై రిచర్డ్‌సన్‌ను 5 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌. 

టామ్‌ కర్రన్‌ను ఆర్సీబీ 1.5 కోట్లకు దక్కించుకుంది.

ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను సీఎస్‌కే 2 కోట్లకు సొంతం చేసుకుంది.

నువాన్‌ తుషారను ముంబై ఇండియన్స్‌ 4.8 కోట్లకు దక్కించుకుంది.

ముంబై ఇండియన్స్‌ శ్రేయస్‌ గోపాల్‌ను 20 లక్షలకు దక్కించుకుంది.

గుజరాత్‌ టైటాన్స్‌ మానవ్‌ సుతార్‌ను 20 లక్షలకు సొంతం చేసుకుంది. 

బంపర్‌ ఆఫర్‌ కొట్టిన రింకూ సింగ్‌ బాధితుడు
గత ఐపీఎల్‌లో రింకూ సింగ్‌ చేతిలో చావుదెబ్బ​ (ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు) తిన్న యశ్‌ దయాల్‌ 2024 ఐపీఎల్‌ వేలంలో జాక్‌పాట్‌ కొట్టాడు. అతన్ని ఆర్సీబీ 5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కుమార్‌ కుషాగ్రాను 7.2 కోట్లకు దక్కించుకుంది. 

గుజరాత్‌ టైటాన్స్‌ యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగిని 60 లక్షలకు దక్కించుకుంది. 

భారత అండర్‌-19 ఆటగాడు అర్షిన్‌ కులకర్ణిని రూ.20 లక్షలకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆన్‌క్యాప్డ్‌ ఆటగాడు సమీర్‌ రిజ్వీ రూ.8.40 కోట్లకు చెన్నైసూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

విధర్బకు చెందిన ఆన్‌క్యాప్డ్‌ ఆటగాడు శుబమ్‌ దుబేను రూ. 5.80 కోట్ల భారీ ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల వద్ద ఉన్న మిగిలిన నగదు
ఢిల్లీ క్యాపిటల్స్‌: రూ. 24.45 కోట్లు
గుజరాత్‌ టైటాన్స్‌: రూ. 31.85 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ.13.15 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్‌: రూ. 11.6 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రూ. 11.75 కోట్లు
ముంబై ఇండియన్స్‌: రూ. 8.15 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రూ.6.95 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్‌: రూ. 6.75 కోట్లు
రాజస్థాన్‌ రాయల్స్‌: రూ. 7.1 కోట్లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్: రూ. 3.6 కోట్లు

శ్రీలంక యువ పేసర్‌ దిల్షాన్‌ మధుశంకను రూ. 4.6 కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. 
భారత పేసర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ను రూ. 1.6 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది.

ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌కు జాక్‌పాట్‌ రూ. 24.75 కోట్లు. స్టార్క్‌కు భారీ ధరకు దక్కించుకున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌. 

భారత బౌలర్‌ శివమ్‌ మావీకి రూ.6.40కోట్లు. మావీకి దక్కించుకున్న లక్నో సూపర్‌ జాయింట్స్‌. 

ఇండియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు భారీ ధర రూ. 5.80కోట్లు. ఉమేశ్‌ను దక్కించుకున్న గుజరాత్‌ టైటాన్స్‌. 

విండీస్‌ బౌలర్‌ అల్జ్‌జరీ జోసెఫ్‌కు భారీ ధర.. రూ.11.50కోట్ల ధర. జోసెఫ్‌ను దక్కించుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. పోటీ పడిన లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ

భారత యువ వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భర్‌తను రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ను రూ. 50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది.

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ను రూ. 4.20 కోట్ల భారీ ధరకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

డార్లీ మిచెల్‌కు రూ. 14 కోట్లు...
వేలంలో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డార్లీ మిచిల్‌పై కోట్ల వర్షం కురిసింది. మిచిల్‌ను రూ. 14 కోట్లకు చెన్నై సూపర్‌ కంగ్స్‌ సొంతం చేసుకుంది. కోటి రూపాయలు బేస్‌ ‍ఫ్రైజ్‌గా వేలంలోకి వచ్చిన మిచిల్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌, సీఎస్‌కే తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి సీఎస్‌కే సొంతం చేసుకుంది.

హర్షల్‌ పటేల్‌కు భారీ ధర..
►వేలంలో టీమిండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌కు ఊహించని ధర దక్కింది. హర్షల్‌ పటేల్‌ను రూ. 11.75 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసింది.

► గెరాల్డ్‌  కోట్జీ:  రూ5 కోట్లకు కొనుగోలు చేసిన  ముంబై ఇండియన్స్‌ 

ప్యాట్‌ కమ్మిన్స్‌కు జాక్‌ పాట్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా కమ్మిన్స్‌ నిలిచాడు. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలుచేసింది. అతడి కోసం ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి.

శార్ధూల్‌కు జాక్‌ పాట్‌..
►టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ రూ.4కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. 
►అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ ఒమర్జాయ్‌ను రూ. 50లక్షలకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది.

సీఎస్‌కేలోకి కివీ స్టార్‌..
►న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్రకు నామమాత్రపు ధరే దక్కింది. రూ 1.50 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఈ వరల్డ్‌కప్‌ హీరో కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ వెనక్కి తగ్గడంతో సీఎస్‌కే సొంతం చేసుకుంది.

►శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాను రూ. 1.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది.

► ఈ వేలంలో టీమిండియా ఆటగాళ్లు మనీష్‌ పాండే, కరుణ్‌ నాయర్‌, అమ్ముడు పోలేదు. అదే విధంగా ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌కు భారీ ధర దక్కింది. హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. హెడ్‌ కోసం సీఎస్‌కే పోటీ పడినప్పటికీ ఆఖరికి ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ. 4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటిల్స్‌ కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌-2024 మినీ వేలంలో అమ్ముడు పోని తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన రూసో నిలిచాడు. రూసోను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు.

రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్‌
ఐపీఎల్‌-2024 మినీ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాడిగా వెస్టిండీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌ రోవ్‌మన్ పావెల్ నిలిచాడు. పావెల్‌ను రూ. 7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. 

ఐపీఎల్‌ వేలం ప్రారంభం..
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా ఐపీఎల్‌-2024 మినీ వేలం ప్రారంభమైంది. ఐపీఎల్‌ చైర్మెన్‌ అరుణ్ సింగ్ ధుమాల్ వేలం పక్రియనను ప్రారంభించారు. కాగా వేలంను మల్లికా సాగర్‌ నిర్వహించనున్నారు.

ఐపీఎల్‌-2024 మినీ వేలం మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీల మేనెజ్‌మెంట్‌  కోకాకోలా ఎరీనాకు చేరుకున్నారు.  గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ .. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున వేలంలో పాల్గోనున్నాడు. 

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 మినీ వేలానికి సమయం అసన్నమైంది. మరికొన్ని గంట్లలో దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ వేలం ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్‌ వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి. 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఈ లీగ్‌ వేలాన్ని ఓ మహిళ నిర్వహించనున్నారు.

డబ్ల్యూపీఎల్‌ రెండు సీజన్ల వేలం పాటను విజయవంతంగా నిర్వహించిన మల్లికా సాగర్‌కు.. ఈ సారి ఆటగాళ్లను వేలంవేసే బాధ్యతను బీసీసీఐ అప్పగించింది. ఇక ఈ వేలంలో మొత్తంగా 333 మంది ఆటగాళ్లు పాల్గోనున్నారు. కాగా 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 విదేశీ ఆటగాళ్ల కోసం ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వేలం పాటలో అనుసరించాల్సిన ప్రణాళికలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి.

ఏ ఫ్రాంచైజీ పర్స్‌లో ఎంతందంటే?
ఈ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ అత్యధిక పర్స్‌ వాల్యూతో బరిలోకి దిగనుంది. గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ. 38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. ఆ తర్వాత వరుసగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌   (రూ.34 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (రూ.32.7 కోట్లు) చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ.31.4 కోట్లు), పంజాబ్‌ కింగ్స్‌ (రూ.29.10 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (రూ.28.95 కోట్లు) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (రూ.23.25 కోట్లు), ముంబై ఇండియన్స్‌(రూ.17.75 కోట్లు), రాజస్తాన్‌ రాయల్స్‌(రూ. 14.5 కోట్లు), లక్నో సూపర్‌ జెయింట్స్‌(రూ. 13.15 కోట్లు) ఉన్నాయి.

ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే..

 గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

గుజరాత్‌ టైటాన్స్‌ గరిష్ఠంగా ఎనిమిది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అందులో ఇద్దరి వీదేశీ ఆటగాళ్లు స్ధానాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్

ముంబైలో ప్రస్తుతం 8 ఖాళీలు ఉన్నాయి. అందులో 4 స్ధానాలు వీదేశీ ఆటగాళ్లవి

చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్‌ కుమార్

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా 9 మందిని తీసుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్లు (4)

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్‌ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2)

రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3)

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ 

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్‌, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ 

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4)

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2)

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4)

>
మరిన్ని వార్తలు