William Porterfield Retirement: ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్‌ మూలస్థంభం

17 Jun, 2022 07:47 IST|Sakshi

ఐర్లండ్‌ జట్టు నుంచి మరో స్టార్‌ క్రికెటర్‌ విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌ గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌ కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయాల్లో మూలస్థంభంలా నిలిచిన అతను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. కాగా పోర్టర్‌ ఫీల్డ్‌ 148 వన్డేల్లో 11 సెంచరీలు సహా 4343 పరుగులు చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో పాక్‌పై గెలుపు, 2009 టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై, 2011 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయాల్లో పోర్టర్‌ఫీల్డ్‌ భాగంగా ఉన్నాడు.

అంతేకాదు ఐర్లండ్‌కు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత పోర్టర్‌ఫీల్డ్‌ సొంతం​. ఆటకు గుడ్‌బై చెప్పిన పోర్టర్‌ఫీల్డ్‌ ఇక నుంచి కోచ్‌ పాత్రలో మెరవనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్‌ ఐర్లాండ్‌ పోర్టర్‌ఫీల్డ్‌తో తమ అనుబంధాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ క్రికెటర్‌.. వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ నమోదు

మరిన్ని వార్తలు