IND VS WI: టీమిండియాకు ఓపెనర్ల కొరత.. జట్టులోకి టి20 స్పెషలిస్ట్‌

3 Feb, 2022 21:15 IST|Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నవదీప్‌ సైనీ, శ్రేయాస్‌ అయ్యర్‌ సహా పలువురు సిబ్బందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో తొలి వన్డేకు టీమిండియాకు ఓపెనర్ల కొరత ఎదురైంది. ధావన్‌, రుతురాజ్‌లు కరోనాతో.. వ్యక్తిగత కారణాలతో కేఎల్‌ రాహుల్‌ తొలి వన్డేకు దూరమయ్యారు. దీంతో మయాంక్‌ అగర్వాల్‌లు ఉన్న పళంగా మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపిచ్చారు. టీమిండియా గురువారం నుంచి ప్రాక్టీస్‌ ఆరంభించింది. అయితే నిబంధనల ప్రకారం మయాంక్‌ మూడురోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో మ్యాచ్‌ జరగనున్న ఆదివారం రోజున అందుబాటులోకి రానున్నాడు.

చదవండి: హార్దిక్‌ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్‌

ఒకవేళ మయాంక్‌ ఆడని పరిస్థితి వస్తే ఎలా అని బీసీసీఐ యోచన చేసింది. దీంతో బ్యాకప్‌ ఓపెనర్‌గా టి20 స్పెషలిస్ట్‌ ఇషాన్‌ కిషన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ ఎంపికకు ముందు ఇషాన్‌ కిషన్‌ టి20 సిరీస్‌కు మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డే వరకు రోహిత్‌, మయాంక్‌లకు బ్యాకప్‌ ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ ఉంటాడని తెలిపింది. రెండో వన్డేకు కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి వస్తే.. ఇషాన్‌ను టి20 జట్టులోకి తిరిగి పంపించనున్నారు. ఒకవేళ తొలి వన్డే సమయానికి మయాంక్‌ ఆడకపోతే.. ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇషాన్‌ కిషన్‌ ఇప్పటికే బయోబబూల్‌లో ఉంటు​న్నాడు. 

ఇక ఇషాన్‌ కిషన్‌ శ్రీలంక గడ్డపై  జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఇషాన్‌ కిషన్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇక 5 టి20 మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. 
చదవండి: Yash Dhull: యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

మరిన్ని వార్తలు