అభిమానితో సెల్ఫీ అతనికి శాపంగా మారింది 

12 Aug, 2020 14:30 IST|Sakshi

లండన్‌ : ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన‌ జోర్డ‌న్ కాక్స్‌పై టీమ్ యాజ‌మాన్యం వేటు వేసింది.కెంట్ జ‌ట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ కాక్స్‌.. బాబ్ విల్లీస్ ట్రోఫీ మ్యాచ్‌లో స‌సెక్స్ టీమ్‌పై 238 ర‌న్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. కానీ ఆ మ్యాచ్‌లో అత‌ను కోవిడ్‌19 నియ‌మావ‌ళిని ఉల్లంఘించాడు. డ‌బుల్ సెంచ‌రీ చేసి రికార్డు క్రియేట్ చేసిన 19 ఏళ్ల కాక్స్‌.. స్టేడియంలో ఓ అభిమానితో సెల్ఫీ దిగాడు.  దీంతో అత‌న్ని మిడిల్‌సెక్స్‌తో జ‌రిగే మ్యాచ్‌కు దూరం పెట్టారు. బ‌యో సెక్యూర్, సోష‌ల్ డిస్టాన్సింగ్ నియమావ‌ళిని అత‌ను ఉల్లంఘించిన‌ట్లు టీమ్ యాజ‌మాన్యం చెప్పింది. (ఆరోజు సచిన్‌ నక్కతోకను తొక్కాడు : నెహ్రా)

అయితే కోవిడ్‌19 ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌స్తేనే, తిరిగి జోర్డ‌న్ కాక్స్‌ను జ‌ట్టులోకి తీసుకోనున్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల కాక్స్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జోర్డ‌న్ మంచి క్రికెట‌ర్ కానీ అత‌ను ప్రోటోకాల్ బ్రేక్ చేశాడ‌ని, అత‌ను క‌చ్చితంగా సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల్సిందే అని డైర‌క్ట‌ర్ పౌల్ డౌన్‌టౌన్ తెలిపారు. (ధోనికి వయసుతో సంబంధం లేదు : వాట్సన్)‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు