ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత

21 Oct, 2023 21:58 IST|Sakshi

మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ , ఇంగ్లండ్‌ ఫుట్‌ బాల్‌ దిగ్గజం సర్ బాబీ చార్ల్టన్(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆశింగ్టనన్‌లోని తన సృగృహంలో శనివారం తుదిశ్వాస విడిచారు. 1966లో జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంపకప్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకోవడంలో చార్ల్టన్‌ది కీలక పాత్ర. 

వెస్ట్‌ జర్మనీతో జరిగిన ఫైనల్లో ఆయన అద్బుతమైన గోల్స్‌ సాధించి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తన కెరీర్‌లో రెడ్ డెవిల్స్ తరపున 758 మ్యాచ్‌లు చార్ల్టన్.. 249 గోల్స్‌ సాధించాడు. అదే విధంగా 1968లో మాంచెస్టర్ యునైటెడ్‌ క్లబ్‌ తరపున యూరోపియన్ కప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. మాంచెస్టర్ యునైటెడ్‌ క్లబ్‌ కూడా నివాళులర్పించింది .

మరిన్ని వార్తలు