T20 WC 2022: సీఎస్‌కే బౌలర్‌కు బంపర్ ఆఫర్.. టీమిండియాతో పాటుగా ఆస్ట్రేలియాకు!

3 Oct, 2022 19:59 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 కోసం టీమిండియా అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. జస్ప్రీత్ బుమ్రా మినహా 15 మందితో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్‌కు వారం రోజుల ముందే కంగారూల గడ్డపై అడుగుపెట్టనుంది. అదే విధంగా స్టాండ్‌ బై ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్ చాహర్ ఆక్టోబర్‌ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు.

ఈ ముగ్గురు ఆటగాళ్లు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత జట్టులో భాగంగా ఉన్నారు. కాగా ప్రాధాన జట్టుతో పాటు నెట్‌ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇప్పటికే  ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వంటి పేస్‌ బౌలర్లను నెట్‌ బౌలర్లగా బీసీసీఐ ఎంపిక చేయగా.. తాజాగా మరో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లను కూడా నెట్‌ బౌలర్లగా ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు తెలుస్తోంది.

స్పోర్ట్‌స్టార్‌ నివేదిక ప్రకారం.. ఈ బౌలర్ల జాబితాలో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముఖేష్ చౌదరి, చేతన్ సకారియా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ముఖేష్ చౌదరి అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖేష్‌ ప్రస్తుతం పూణేలో శిక్షణ పొందుతుండగా.. ఉమ్రాన్‌, సకారియా, కుల్దీప్ సేన్ ఇరానీ కప్‌లో ఆడుతున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 23న దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.

టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ , జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్
స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్‌! శ్రేయస్‌కు ఛాన్స్‌

మరిన్ని వార్తలు