పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే?

15 Nov, 2023 21:57 IST|Sakshi

అన్నిఫార్మాట్లలో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు టెస్టు, టీ20 ఫార్మాట్‌లలో తమ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌గా స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది ఎంపికయ్యాడు. అదే విధంగా తమ టెస్టు కెప్టెన్‌గా వెటరన్‌ ఆటగాడు షాన్‌ మసూద్‌ను పీసీబీ నియమించింది.

ఈ మెరకు సోషల్‌ మీడియా వేదికగా పీసీబీ పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వన్డేలకు మాత్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు. స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు వన్డేల్లో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఫార్మాటల్లో వేర్వేరు కెప్టెన్లను నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
చదవండిCWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్‌ చేయడం సంతోషం: సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు