బారెడు జట్టుతో అంపైర్‌, మీమ్స్‌ హోరు

19 Oct, 2020 12:34 IST|Sakshi

ఐపీఎల్‌ 2020 లో మహిళా అంపైర్‌?

అంపైర్‌ పశ్చిమ్‌ పాఠక్‌పై మీమ్స్‌

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత నైట్‌ రైడర్స్‌ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసి ఉత్కంఠ రేకెత్తించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్ జట్టు 163 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ కూడా 20 ఓవర్లలో 163 పరుగులే చేయగలిగింది. టై గా ముగిసిన మ్యాచ్‌లో కేకేఆర్‌ సూపర్‌ విజయం సాధించింది. ఆద్యంతం అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో అంపైర్‌ పశ్చిమ్‌ పాఠక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట మొదలైనప్పటి నుంచి ఆయన అంపైరింగ్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వరద కొనసాగింది. పాఠక్‌ అంపైరింగ్‌ విధానం, హెయిర్‌ స్టైయిల్‌ దీనికి కారణం. ఆయన జుట్టు మహిళల మాదిరిగా బారెడు పొడుగు ఉండటంతో.. ‘మహిళా అంపైర్‌ ఎవరబ్బా?’అంటూ కొందరు అభిమానులు ప్రశ్నలు సంధించారు. 
(చదవండి: సూపర్‌: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు)

‘ఐపీఎల్‌లో మొట్ట మొదటిసారి అంపైరింగ్‌ చేస్తున్న ఈ మ‌హిళను చూడండి.. ఎంత అందంగా ఉందో’ అంటూ మీమ్స్ కూడా వేశారు కొందరు. బౌలర్‌ బంతిని విసిరే స‌మ‌యంలో ఒకప్పటి అంపైర్ల మాదిరిగా ముందుకు వంగి ఉండ‌టం పాఠక్‌ స్పెషాలిటీ. ఆయన అంపైరింగ్ స్టాండ‌ర్డ్స్ కూడా బాగుంటాయ‌ని పేరుంది. విజ‌య్ హ‌జారే టోర్నీలో మొట్ట మొద‌టిసారిగా హెల్మెట్ ధ‌రించి అంపైరింగ్‌ చేసింది కూడా పాఠకే. వికెట్ కీప‌ర్ అంపైర్‌లాగా నిల‌బ‌డితే.. అంపైర్ వికెట్ కీప‌ర్ లా నిలుచున్నాడని కొందరు ట్రోల్‌ చేశారు. మరికొందరు మాత్రం పాఠక్‌ సంప్రదాయక పద్ధతిలో అంపైరింగ్‌ బాగుందంటూ.. ఆయన్ని రాక్‌స్టార్‌ అంటూ పొగిడేస్తున్నారు. కాగా, 2014లో తొలిసారి ఆయన ఐపీఎల్‌లో అంపైరింగ్‌ చేశాడు. మళ్లీ తాజా సీజన్‌లో ఫీల్డులోకి దిగాడు. 
(చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు