-
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
Kohli And Dhoni New Photos: ధోని, కోహ్లి కొత్త హెయిర్‌స్టైల్ ఎలా ఉంది?.. ఫొటోలు
-
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
పెళ్లికళకు పరిపూర్ణత.. ఆధునికపు హెయిర్ స్టైల్స్! ఇలా ముస్తాబైతే..
కలల రోజు కళ్ల ముందు నిలిచే సమయం అత్యంత వైభవంగా మారిపోవాలనుకుంటారు. అందుకు తగినట్టుగానే ప్రతి అలంకరణలోనూ ప్రత్యేకత చూపుతారు. ఆ పెళ్లి కళకు పరిపూర్ణత రావాలంటే మాత్రం కేశాలంకరణదే అత్యంత కీలకమైన పాత్ర. సాధారణ డిజైన్స్ నుంచి ఆధునికపు హెయిర్ స్టైల్స్ ఎలా రూపు మార్చుకున్నాయో తెలుసుకుంటే మీదైన ప్రత్యేకమైన రోజుకు మరింత అందంగా ముస్తాబు అవ్వచ్చు. పెళ్లికూతురు ఆకర్షణీయ రూపానికి జీవం పోసేది కేశాలంకరణే. పెళ్లి దుస్తులను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటారో జడను కూడా అంతే స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటారు. సాధారణ పూల జడల నుంచి వజ్రాలతోనూ, బంగారంతోనూ మెరిసే అందమైన పొడవాటి జడలను నవ వధువుల ఎంపికలో ఉంటాయి. అలాగే, పెళ్లికూతురి దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా వీటి ఎంపికలో పోటీ పడుతుంటారు. ఇందుకు ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు ఇతర ఫ్యాన్సీ జడలు కూడా రకరకాల డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. లక్షల రూపాయల నుంచి వందల రూపాయల వరకు ఉన్న ఈ డిజైన్స్‌లో ఇవి కొన్ని. సంప్రదాయ వేడుకలలో వేసే హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంటాయి. ఈ బ్రైడల్ హెయిర్ స్టైల్స్‌లో మార్పులు చూస్తే ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకోసం ఉపయోగిస్తున్న లాంగ్ రిబ్బన్, మిర్రర్, టాజిల్స్తోనూ జడలు ప్రధాన ఆకర్షణగా డిజైనర్ల చేతుల్లో రూపు దిద్దుకుంటున్నాయి. సొంతంగా తయారీ ఆసక్తి గల వారు పూసలు, ముత్యాలు, స్టోన్స్, రంగు దారాలను ఉపయోగించి మల్టీకలర్ లాంగ్ జడలను సొంతంగా తయారు చేసుకోవచ్చు. దారాలకు పూసలు గుచ్చి, గమ్‌తో స్టోన్స్ లేదా అద్దాలను అతికించి పొడవాటి దండలుగా (జడ అంత పొడవులో) తయారు చేసుకోవాలి. వాటిని డ్రెస్‌తో మ్యాచ్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఎలాంటి అలంకరణ బాగుంటుందో చూసుకొని, ఆ జడను అలంకరించుకోవాలి. ఫ్యాన్సీ అలంకరణ సాధారణ కేశాలంకరణలో మల్లె, గులాబీ పూల జడలు పెళ్లికూతురు అలంకరణలో భాగంగా ఉంటాయి. కొందరు తమ చీర రంగుతో మ్యాచ్ అయ్యే పూల జడలను ఎంపిక చేసుకుంటారు. ఇవే కాకుండా స్వరోస్కి స్టోన్స్ ఉన్న పొడవాటి వరుసల క్లిప్స్‌ను పెట్టేసి కేశాలంకరణ పూర్తి చేసుకోవచ్చు. ఇవి, రిసెప్షన్ వంటి వేడుకల్లో అందంగా ఉంటాయి. పెళ్లికి ఎంచుకోగల ఆధునిక కేశాలంకరణలో ఇవి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిజైన్ బట్టి ఈ జడల ధరలు అందుబాటులో ఉన్నాయి. మెరిసే.. మెరిసే కేశాలంకరణ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు ప్రతిరోజూ స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారికి డే హెయిర్ జ్యువెలరీ (హెయిర్ క్లిప్స్) అందుబాటులో ఉన్నాయి. వీటిని గెట్ టు గెదర్ వంటి పార్టీలకు వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సులకూ అందంగా నప్పుతాయి. పెళ్లి కూతురి లేదా అతిథుల తమ కేశాలంకరణలో వివిధ స్టైల్స్‌ను అనుకరించాలంటే అందుకు తగిన ఆన్లైన్ ట్యుటోరియల్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ఎలాంటి స్టైల్ బాగుంటుందో ఎంపిక చేసుకునే వీలుంటుంది. మీదైన గొప్ప రోజు కోసం మీ జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల పెళ్లికి వచ్చే మొత్తం అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. పెళ్లిరోజును మరింతగా వెలిగిపోయేలా మార్చేస్తుంది. చదవండి: Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో.. -
Viral: చూస్తుండగానే తలపై క్రిస్మస్ చెట్టు రెడీ..! గిన్నిస్ రికార్డు హెయిర్ స్టైల్
వైరల్: పొడవైన జుట్టంటే ఇష్టపడని అమ్మాయిలే ఉండరనడంలో అతిశయోక్తే లేదు. రోజుకో కొత్త హెయిర్ స్టైల్ చేసుకోవడం అమ్మాయిలకు తెగ అలవాటు. తాజాగా ఓ ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ సరికొత్త హెయిర్ స్టైల్ డిజైన్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు. సెప్టెంబర్ 16న దుబాయ్‌లో ప్రపంచలోనే పొడవైన హెయిర్ స్టైల్‌గా హిస్వాని ఈ ఘనత సాధించారు. కాగా హిస్వాని ప్రపంచ ఫ్యాషన్ మ్యగజైన్లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. ఇందులో హిస్వాని ముందుగా మోడల్ తలకు సపోర్ట్‌గా ఓ హెల్మెట్‌ను పెట్టింది. దానిపై మూడు మెటల్ రాడ్లు అమర్చి జుట్టును క్రిస్మస్ చెట్టు ఆకారంలో వచ్చేందుకు విగ్‌లు, హెయిర్ ఎక్స్టన్షన్స్ను ఉపయోగించించారు. చివరికి హెయిర్ స్టైల్ అనుకున్న సైజ్‌లో వచ్చేందుకు పై అంతస్తుకు వెళ్లీ మరీ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement