న్యూజిలాండ్‌దే రెండో టి20

26 Feb, 2021 00:51 IST|Sakshi

4 పరుగులతో ఓడిన ఆస్ట్రేలియా  

డ్యునెడిన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్టిన్‌ గప్టిల్‌ (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) కేన్‌ విలియమ్సన్‌ (35 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జిమ్మీ నీషమ్‌ (16 బంతుల్లో 45 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. చివరి 7 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన స్టొయినిస్‌ (37 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డాన్‌ స్యామ్స్‌ (15 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి 40 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... వీరిద్దరు అవుట్‌ కావడంతో 10 పరుగులే వచ్చాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు