NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్‌ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ సేన రికార్డులు!

22 Oct, 2022 15:00 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు దుమ్ములేపారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దంచికొట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఫిన్‌ అలెన్‌ 16  బంతుల్లో 42 పరుగులు సాధించగా.. డెవాన్‌ కాన్వే సైతం అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 23 పరుగులు చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 12 పరుగులు సాధించాడు. జేమ్స్‌ నీషమ్‌ ఆఖర్లో మెరుపులు(13 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్‌) మెరిపించాడు. 

ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్‌ 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌ మీద 190 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన కివీస్‌.. ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌పై ఈ మేరకు రాణించడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ అత్యధిక స్కోర్లు
సిడ్నీ- 2022- ఆస్ట్రేలియా మీద- 200/3
నాటింగ్‌హాం- 2009- ఐర్లాండ్‌ మీద- 198/5
పల్లకెలె- 2012- బంగ్లాదేశ్‌ మీద- 191/32

ఇక ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మెగా టోర్నీ పవర్‌ప్లేలోనూ తమ అత్యధిక స్కోరు(65/1) నమోదు చేసింది న్యూజిలాండ్‌ జట్టు. 
ఆసీస్‌తో గత మ్యాచ్‌లలో పవర్‌ప్లేలో కీవీస్‌ నమోదు చేసిన స్కోర్లు
2018- అక్లాండ్‌లో- 67/0
2018- అక్లాండ్‌లో-63/2

చదవండి: T20 WC 2022: టిమ్‌ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌! కొత్తగా ఎవరంటే?

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు