ఒడిషాలో 89 స్టేడియాలు!

10 Aug, 2021 05:18 IST|Sakshi

భువనేశ్వర్‌: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ క్రీడల పట్ల తమ ప్రాధాన్యతను చూపించిన ఒడిషా ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది. ఒడిషాలో మొత్తం రూ. 693.35 కోట్ల వ్యయంతో 89 మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియాలను నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌’ కింద 18 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారివంటివి ఎదురైనప్పుడు వసతి కేంద్రాలుగా, ఆస్పత్రులుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేడియాలను నిరి్మస్తున్నారు. 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో రూర్కెలాలో ‘బిర్సా ముండా’ పేరుతో అధునాతన హాకీ స్టేడియాన్ని రూ. 120 కోట్ల వ్యయం తో ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తోంది.

మరిన్ని వార్తలు