#KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్‌'

14 Jul, 2023 09:00 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్‌ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్‌ చేరుకున్నారు. ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి ఎలిజబెత్‌ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్‌ నేషనల్‌ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో సమావేశమవుతారు.

కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌.. జట్టు కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు.

'' ఇవాళ ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్‌ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక 2018లో ఫ్రాన్స్‌ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్‌లో ఓడి ఫ్రాన్స్‌ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్‌ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్‌ చేశాడు.

చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'

క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం

>
మరిన్ని వార్తలు