Ranji Trophy 2023 Finals: బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి

18 Feb, 2023 18:43 IST|Sakshi

బెంగాల్‌-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్‌ కెప్టెన్‌, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (57) షాబాజ్‌ అహ్మద్‌ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్‌ మజుందార్‌ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్‌ (16), సుదీప్‌ కుమార్‌ గరామీ (14) నిరాశపరిచారు.

సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్‌ (2/47), చేతన్‌ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్‌ దేశాయ్‌ (50), షెల్డన్‌ జాక్సన్‌ (59), వనవద (81), చిరాగ్‌ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 4, ఆకాశ్‌దీప్‌, ఇషాన్‌ పోరెల్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్‌ (3/44), సకారియా (3/33), చిరాగ్‌ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్‌ అహ్మద్‌ (69), అభిషేక్‌ పోరెల్‌ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 
 

మరిన్ని వార్తలు