నాకైతే సంబంధం లేదు: రవిశాస్త్రి

1 Nov, 2020 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా జట్టును మూడు ఫార్మాట్లకు ఎంపిక చేయగా అందులో  హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ చోటు దక్కలేదు. తొడకండరాల గాయం కారణంగా రోహిత్‌ను పక్కకు పెట్టామని సెలక్టర్లు చెబుతున్నా అది వివాదానికి దారి తీసింది. విరాట్‌ కోహ్లితో విభేదాలు కారణంగానే రోహిత్‌ను ఎంపిక చేయలేదని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ప్రకటించిన కాసేపటికే.. రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అయోమయానికి లోనయ్యారు.(ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా ?)

గాయపడిన మయాంక్ అగర్వాల్‌ను ఆస్ట్రేలియా పర్యటనలో మూడు ఫార్మాట్లకూ ఎంపిక చేసిన సెలక్టర్లు...రోహిత్‌ను మాత్రం ఎందుకు పక్కనబెట్టారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నాడు. సెలక్షన్‌ విషయంలో తాను భాగం కాలేదన్నాడు. కానీ రోహిత్‌ మరొకసారి గాయపడే ప్రమాదముందని మెడికల్‌ టీమ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన విషయం మాత్రమే తనకు తెలుసన్నాడు. ఇదిలా ఉంచితే, రోహిత్ శర్మ మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉందని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత పొలార్డ్ మాట్లాడుతూ రోహిత్ త్వరలోనే తిరిగి ఆడే అవకాశం ఉందని తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు