IND Vs AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు

25 Sep, 2023 07:26 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(105), శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్‌ యాదవ్‌( 72 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌(52) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

భారత ఇన్నింగ్స్‌లలో ఏకంగా  31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్‌ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటరల్లో సీన్‌ అబాట్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్‌ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు.

రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత..
ఇక తొలి వన్డేలో పెద్దగా అకట్టుకోపోయిన భారత స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌.. రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో ఆశూ సత్తాచాటాడు. 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అశ్విన్‌.. 41 పరుగులిచ్చి 3వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అశ్విన్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఓ ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఆసీస్‌పై అశ్విన్‌ ఇప్పటివరకు మూడు ఫార్మాట్‌లు కలపి 144 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం​ అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే కూడా కంగారూలపైనే ఈ ఫీట్‌ సాధించాడు.

ఆస్ట్రేలియాపై 142 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు. అశ్విన్‌ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కుంబ్లే తర్వాత భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌(141) ఉన్నాడు.
చదవండి: IND VS AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్‌లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు

మరిన్ని వార్తలు