IND vs SA: తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్‌ ప్రశంసలు

1 Dec, 2023 16:36 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లకు మూడు వేర్వేరు భారత జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లకు జట్ల ఎంపికలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రోటీస్‌తో వన్డే,టీ20లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా టీ20ల్లో అదరగొడుతున్న రింకూ సింగ్‌, దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న తమిళనాడు యవ సంచలనం సాయిసుదర్శన్‌కు సెలక్లర్లు తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపిక చేశారు.

వీరిద్దరితో పాటు రజిత్ పాటిదార్‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. అదేవిధంగా పేసర్‌ దీపక్‌ చాహర్‌ కూడా ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. కాగా టెస్టుల్లో మరోసారి వెటరన్‌ ఆటగాళ్లు అజింక్యా రహానే, పుజారాకు సెలక్టర్లు మొండి చేయిచూపించారు. ఇక టీ20ల్లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌, టెస్టుల్లో రోహిత్‌ శర్మ జట్టును నడిపించనున్నారు.

సుదర్శన్‌పై ప్రశంసల వర్షం.. 
కాగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సాయిసుదర్శన్‌ను టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభినందించాడు. "వావ్ సాయి సుదర్శన్! అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ తొలిసారి భారత జట్టులో చోటుదక్కించకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ" ట్విటర్‌లో అశ్విన్‌ రాసుకొచ్చాడు. అశ్విన్‌, సుదర్శన్‌ ఇద్దరూ దేశీవాళీ క్రికెట్‌లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో సుదర్శన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత రెండు సీజన్ల ఐపీఎల్‌లో కూడా సాయి అదరగొట్టాడు. ఇప్పటివరకు తన లిస్ట్‌-ఏ కెరీర్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే! యువ సంచలనం ఎంట్రీ

మరిన్ని వార్తలు