రిషబ్‌ పంత్‌, ధావన్‌ క్రికెట్‌ గురువు కన్నుమూత

6 Nov, 2021 14:55 IST|Sakshi

cricket coach Tarak Sinha Lost Life Battle With Cancer.. టీమిండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ గురువు, క్రికెట్‌ కోచ్‌ తారక్‌ సిన్హా(71) క్యాన్సర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. తారక్‌ సిన్హా ఢిల్లీలో సోనెట్‌ క్రికెట్‌ క్లబ్‌ను నడిపేవాడు. ఈ సందర్భంగా ఆయన ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దారు. అతని పర్యవేక్షణలో రాటుదేలిన ఆటగాళ్లలో 12 మంది అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఆశిష్‌ నెహ్రా, ఆకాశ్‌ చోప్రా, శిఖర్‌ ధావన్‌, అంజుమ్‌ చోప్రా, రిషబ్‌ పంత్‌, మనోజ్‌ప్రభాకర్‌, అజయ్‌ శర్మ, కె.పి. భాస్కర్‌, సంజీవ్‌ శర్మ, రామన్‌ లంబా, అతుల్‌ వాసన్‌, సురేందర్‌ ఖన్నా, రణ్‌దీర్‌ సింగ్‌ లాంటివారు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ధావన్‌, పంత్‌లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా క్రీడా పురస్కారాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదో క్రికెట్‌ కోచ్‌గా తారక్‌ సిన్హా నిలిచాడు. క్రికెట్‌ భాషలో అతన్ని అందరూ ''ఉస్తాద్‌ జీ'' అని ముద్దుగా పిలుచుకుంటారు. కాగా  తారక్‌ సిన్హా కంటే ముందు రమాకాంత్‌ అచ్రేకర్‌, దేశ్‌ ప్రేమ్‌ ఆజాద్‌, గురుచరన్‌ సింగ్‌, సునీత శర్మలు  ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. 

చదవండి: Syed Mushtaq Ali Trophy 2021: కెప్టెన్‌ సెంచరీ మిస్‌.. అయితేనేం హైదరాబాద్‌ భారీ విజయం

మరిన్ని వార్తలు