IPL 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్‌.. తొలి భారత క్రికెటర్‌గా!

1 Apr, 2023 11:33 IST|Sakshi
PC: ipl.com

Gujarat Titans vs Chennai Super Kingsఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ మాత్రం తన అద్బుత ఇన్నింగ్స్‌తో అందరని అకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తృటిలో తన తొలి ఐపీఎల్‌ సెంచరీ అవకాశాన్ని రుత్‌రాజ్‌ కోల్పోయాడు. 50 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92 పరుగులు సాధించాడు. అదే విధంగా గైక్వాడ్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 23 బంతుల్లోనే అందుకున్నాడు.

సచిన్‌ రికార్డు బ్రేక్‌..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రుత్‌రాజ్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు.  ఐపీఎల్‌లో 37 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రుత్‌రాజ్‌ నిలిచాడు. ఇప్పటి వరకు 37 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌.. 1299 పరుగులు సాధించాడు.

అయితే ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉండేది. సచిన్‌ 37 ఇన్నింగ్స్‌లలో 1271 పరుగులు సాధించాడు.  తాజా మ్యాచ్‌తో సచిన్‌ రికార్డును గైక్వాడ్‌ బ్రేక్‌ చేశాడు. ఇక సచిన్‌ తర్వాతి స్థానంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పం‍త్‌(1184) ఉన్నాడు.
చదవండి: IPL 2023: వారిద్దరూ అద్భుతం.. క్రెడిట్‌ వారికే ఇవ్వాలి! అది మాత్రం చాలా కష్టం

మరిన్ని వార్తలు