'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్‌ తినాలి'

11 Mar, 2021 12:24 IST|Sakshi

రాయ్‌పూర్‌: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు. సచిన్‌ ఈ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్‌ సారధ్యంలో రెండు మ్యాచ్‌లాడిన ఇండియా లెజెండ్స్‌ ఒక దాంట్లో ఓడి మరొక దాంట్లో గెలిచింది. తాజాగా ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ ఆటగాడు క్రిస్‌ ట్రెమ్లెట్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

''ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నా.. సచిన్‌ వయసు వచ్చేసరికి అదే ఫిట్‌నెస్‌తో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ట్రెమ్లెట్‌ ఫోటోను రీట్వీట్‌ చేస్తూ సచిన్‌ వినూత్నరీతిలో కామెంట్‌ చేశాడు. సచిన్‌ ట్రెమ్లెట్‌ ఫిజిక్‌ను పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ట్రెమ్లెట్‌.. నేను నీలాగా ఉండాలంటే రోజుకు ఎన్ని ఆమ్లెట్స్‌ తినాలి? అంటూ'' ఎమోజీ పెట్టాడు. సచిన్‌ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

కాగా ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్‌ ట్రెమ్లెట్‌ ఆరు అడుగుల ఏడు అంగుళాల పొడగరి కాగా.. అతను తన ఫిజిక్‌ను కాపాడుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. స్వతహగా మంచి బిల్డర్‌ అయిన ట్రెమ్లెట్‌ రోజుకు 8వేల కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. చూడగానే భారీ కాయంగా కనబడే ట్రెమ్లెట్‌ ఇంగ్లండ్‌ తరపున 12 టెస్టుల్లో 50 వికెట్లు , 15 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 
చదవండి:
వైరలవుతోన్న సచిన్‌ ప్రాంక్‌ వీడియో

మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా!

మరిన్ని వార్తలు