T20 Blast 2023: సామ్‌ కర్రాన్‌ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!

22 Jun, 2023 12:37 IST|Sakshi

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో ఇంగ్లీష్‌ ఆల్‌ రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సర్రే క్లికెట్‌ క్లబ్‌కు సామ్‌ కర్రాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  లండన్‌లోని ఓవల్ మైదానంలో , గ్లామోర్గాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్రాన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 

ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్‌ జట్టు బౌలర్లను కర్రాన్‌ ఊచకోత కోశాడు. కర్రాన్‌ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కర్రాన్ తన పేరిట లిఖించకున్నాడు. ఓవరాల్‌ ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్‌.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు.

అతడితో పాటు ఓపెనర్లు విల్‌ జాక్స్‌(69), ఏవెన్స్‌(40) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే..238 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది. అనంతరం 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్‌ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. గ్లామోర్గాన్‌ బ్యాటర్లలో క్రిస్‌ కోక్‌(49) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. సర్రే బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు, నరైన్‌ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని

మరిన్ని వార్తలు