T20 WC 2021 IND Vs PAK: పఠాన్‌ టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవెన్‌.. అశ్విన్‌కు నో ప్లేస్‌

20 Oct, 2021 21:15 IST|Sakshi

Irfan Pathan Pics Team India Playing IX Vs Pak.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ  టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌పైనే ఉన్నాయి. అక్టోబర్‌ 24న జరగనున్న ఇండియా- పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులు తలపడితే ఆ మజా వేరు అన్నట్లుగా ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయి. ఇంతవరకు ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాదే స్పష్టమైన ఆధిక్యం ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌ ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై ఏడు సార్లు విజయాలు అందుకున్న టీమిండియా టి20 ప్రపంచకప్‌లలో ఐదుసార్లు గెలిచింది. ఈ రికార్డును టీమిండియా మరింత మెరుగుపరుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: T20 WC 2021 IND Vs AUS: రెస్ట్‌ అన్నారు.. బౌలింగ్‌తో సర్‌ప్రైజ్‌

ఇక పాకిస్తాన్‌తో తలపడనున్న టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవెన్‌ జట్టును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బుధవారం ప్రకటించాడు. పఠాన్‌ ప్రకటించిన జట్టులో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు. అశ్విన్‌తో పాటు రాహుల్‌ చహర్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఇక ఇర్ఫాన్‌ ప్రకటించిన జట్టులో బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ.. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి.. నాలుగు, ఐదు స్థానాల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లను ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసిన పఠాన్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తికి చోటు కల్పించాడు. ఇక పేస్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రాలను ఎంపికచేశాడు. కాగా అశ్విన్‌ నేడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. 2 ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి కీలకమైన రెండు వికెట్లు తీసి పొట్టి  ఫార్మాట్‌లోనూ సత్తా చాటగలనని మరోసారి నిరూపించాడు.

చదవండి: IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. అసలు సమరానికి ముందు మంచి బూస్టప్‌

ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా

మరిన్ని వార్తలు