T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్‌ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్‌ అంటున్న విశ్లేషకులు

12 Nov, 2021 15:49 IST|Sakshi

Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్‌ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్‌ 10) న్యూజిలాండ్‌ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్‌లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్‌లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. 

న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో ఆసీస్‌ ఇదే మార్జిన్‌(5 వికెట్ల తేడా)తో పాక్‌పై విజయం సాధించింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా కూడా పాక్‌పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. 

రెండు సెమీ ఫైనల్స్‌లో కివీస్‌, ఆసీస్‌ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్‌ల్లో కివీస్‌, ఆసీస్‌ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్‌ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే,  నవంబర్‌ 14న జరిగే తుది సమరంలో ఆసీస్‌, న్యూజిలాండ్‌‌ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్‌, కివీస్‌ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు.
చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్‌ అభిమానులు
 

Poll
Loading...
మరిన్ని వార్తలు