BAN Vs WI: డిపెండింగ్‌ చాంపియన్‌ ఆటతీరు.. వెస్టిండీస్‌కు అలవాటే

29 Oct, 2021 20:08 IST|Sakshi

West Indies Clinch Thrilling Victory Over Bangladesh By 3 Runs.. టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ టి20ల్లో అసలు మజాను చూపించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్‌ కేవలం మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 143 పరుగుల సాధారణ లక్ష్యాన్ని విండీస్‌ కాపాడుకుందంటే అదంతా బౌలర్ల చలువే అని చెప్పొచ్చు. ముఖ్యంగా డెత్‌ ఓవర్స్‌లో బ్రావో, రవి రాంపాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేయగా.. ఆఖరి ఓవర్లో బంగ్లా విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. రసెల్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. యార్కర్‌ విసరడంతో మహ్మదుల్లా ఫ్లిక్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో విండీస్‌ థ్రిల్లింగ్‌ విక్టరీతో రేసులో ఉండగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన బంగ్లా ఇంటిదారి పట్టనుంది. ఇలా తక్కువ పరుగుల తేడాతో విండీస్‌ గెలవడం ఇది మూడోసారి. ఇంతకముందు 2011లో పాకిస్తాన్‌పై 7 పరుగుల తేడాతో.. ఆ తర్వాత భారత్‌పై 2016లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం విశేషం. 

చదవండి: BAN Vs WI: రసెల్‌ డైమండ్‌ డక్‌.. వెంటాడిన దురదృష్టం

కాగా డిపెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన విండీస్‌కు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాలు బిగ్‌షాక్‌ ఇచ్చాయి. ఆ రెండు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఘోర ఓటములను చవిచూసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాత్రం విండీస్‌ తొలిసారి డిపెండింగ్‌ చాంపియన్‌ ఆటతీరును కనబరిచింది. మొదట బ్యాటింగ్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికి  ఇన్నింగ్స్‌ ఆద్యంతం  వచ్చిన బ్యాటర్స్ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం విశేషం. ఇక మ్యాచ్‌ గెలిచిన తర్వాత విండీస్‌ ఆటగాళ్ల సంబరాలు మాములుగా లేవు. పూరన్‌ తన చేతిలో ఉన్న బంతిని నేల మీదకు బలంగా విసిరి గట్టిగా అరుస్తూ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోగా.. మిగతా ఆటగాళ్లు హగ్‌లు ఇచ్చుకుంటూ సంతోషంలో మునిగిపోయారు.

చదవండి: BAN Vs WI: వికెట్లు పోతూనే ఉన్నాయి.. అయినా చితకబాదారు

మరిన్ని వార్తలు