Tokyo Olympics 2020: షాట్‌పుట్‌లో నిరాశపరిచిన తేజిందర్‌పాల్‌

3 Aug, 2021 16:35 IST|Sakshi

షార్ట్‌పుట్‌లో తేజిందర్‌పాల్‌ నిరాశ
► టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా షాట్‌పుట్‌ విభాగంలో భారత అథ్లెట్‌ తేజిందర్‌పాల్‌ సింగ్‌ నిరాశపరిచాడు. మొత్తం మూడు ప్రయత్నాల్లో ఒకసారి మాత్రమే సఫలమైన తేజిందర్‌ 19.99 మీ దూరం విసిరాడు. మిగతా రెండుసార్లు ఫౌల్‌ చేసి ఫెయిల్యూర్‌ అయ్యాడు.

Tokyo Olympics Day 12 Live Updates: ఒలింపిక్స్‌లో భారత్‌ వరుస ఓటములు చవిచూస్తోంది. మంగళవారం జరిగిన ఈవెంట్స్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది. ఓవైపు హాకీ, మరోవైపు జావెలిన్ థ్రో, ఇంకోవైపు రెజ్లింగ్‌లో ఓటములే ఎదురయ్యాయి. మహిళల రెజ్లింగ్‌ 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో తలపడి ఓడింది.

Tokyo Olympics Wrestling:
► 2-2తో స్కోర్‌ సమమైనప్పటికీ.. ఖురెల్ఖూ పాయింట్‌ మూవ్‌ ఆధారంగా ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో సోనమ్‌ మాలిక్‌ ఓటమి పాలైంది.
► ఆరంభంలో దూకుడు చూపించినప్పటికీ.. ఫస్ట్‌ రౌండ్‌ బౌట్‌ను ఓడింది సోనమ్‌.
► తొలి పాయింట్‌ సాధించిన సోనమ్‌
►మహిళల రెజ్లింగ్‌ 62 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ బరిలోకి దిగింది. ఆసియన్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో పోరాడుతోంది.

India-Belgium Men's Hockey Semi-Final Live Updates: 
►చివర్లో మరో పాయింట్‌తో 5-2 తేడాతో బెల్జియం భారత్‌పై ఘన విజయం సాధించింది.

►మొదలైన నాలుగో క్వార్టర్‌. 2-2తో కొనసాగింది మ్యాచ్‌. ఈ తరుణంలో బెల్జియం మరో గోల్‌తో 3-2 ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ తరుణంలో మరో పెనాల్టీ కార్నర్‌ దక్కింది బెల్జియంకు. ఆ వెంటనే మరో గోల్‌తో బెల్జియం 4-2తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

►మూడో క్వార్టర్‌ ముగిసేందుకు ఏడు నిమిషాలుండగా.. భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ దక్కింది. కానీ, ఎటాకింగ్‌ గేమ్‌తో బెల్జియం భారత్‌ను ఇరకాటంలో పెడుతోంది. మూడో క్వార్టర్‌ ముగిసేసరికి.. స్కోర్‌ 2-2తో సమంగానే కొనసాగుతోంది.

►సెకండ్‌ క్వార్టర్‌ ముగిసేసరికి 2-2 తేడాతో స్కోర్‌ సమం అయ్యింది. బెల్జియం తరపున లూయిపరట్‌, అలెగ్జాండర్‌ హెన్‌డ్రిక్స్‌ చెరో గోల్‌ కొట్టారు. బెల్జియం డిఫెండింగ్‌ గేమ్‌ ఆడుతుండడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో మూడో క్వార్టర్‌లో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. 

► భారత పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో తలపడుతోంది భారత పురుషుల హాకీ జట్టు. తొలి క్వార్టర్‌లోనే బెల్జియంపై గోల్ చేసిన భారత్‌.. ఆపై బెల్జియంకు ఓ గోల్‌ అప్పజెప్పింది. ఆపై మరో గోల్‌తో 2-1తో నిలిచింది. మన్‌దీప్‌, హర్మన్‌ప్రీత్‌ చెరో గోల్‌ కొట్టారు. తొలి క్వార్టర్‌ ముగిసేసరికి.. భారత్‌ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది.  ఇక రెండో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే.. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్‌ హెన్‌డ్రిక్స్‌ గోల్‌ కొట్టడంతో స్కోర్‌ 2-2 అయ్యింది.
క్లిక్‌ చేయండి: పతకాలు గెస్‌ చేయండి.. క్యాష్‌ ప్రైజ్‌ గెల్వండి

టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ 2020లో పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో భారత హాకీ జట్టు తలపడిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ఓయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో మ్యాచ్‌ ప్రారంభం కాగా.. మ్యాచ్‌ మూడో క్వార్టర్‌ దాకా హోరాహోరీగా నడిచింది. అయితే నాలుగో క్వార్టర్‌ నుంచి బెల్జియం డామినేషన్‌ కొనసాగింది. చివర్లో  బెల్జియం మూడు గోల్స్‌ సాధించడంతో 5-2 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది బెల్జియం.

Tokyo Olympics Women's Javelin Throw: భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో Annu Rani సత్తా చాటలేకపోయింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో 54.4 మీటర్ల దూరం విసిరి 14వ పొజిషన్‌తో సరిపెట్టుకుని.. ఫైనల్‌ ఈవెంట్‌కు క్వాలిఫై కాలేకపోయింది.


టోక్యో ఒలింపిక్స్‌లో నేటి(ఆగష్టు 3) భారత్‌ షెడ్యూల్‌
ఉ.7గం.లకు బెల్జియంతో తలపడనున్న భారత్‌ పురుషుల హాకీ జట్టు (సెమీస్‌)
ఉదయం 7:20 నుంచి అథ్లెటిక్స్‌ మహిళల లాంగ్‌జంప్‌ ఫైనల్‌
ఉదయం 8:30కు మహిళల రెజ్లింగ్‌ 62 కిలోల విభాగం ( సోనమ్‌ మాలిక్‌)
ఉదయం 8:50 నుంచి అథ్లెటిక్స్‌ పురుషుల 400 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌
మధ్యాహ్నం 2:20 నుంచి జిమ్నాస్టిక్స్‌ మహిళల బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్‌
మధ్యాహ్నం 2:45కు మహిళల రెజ్లింగ్‌ 62 కిలోల విభాగం సెమీస్‌
మధ్యాహ్నం 3:45కు పురుషుల షాట్‌బాల్‌ (తజిందర్‌ పాల్‌) క్వాలిఫికేషన్‌
మధ్యాహ్నం 3:50కి అథ్లెటిక్స్‌ పురుషుల పోల్‌వాల్ట్‌ ఫైనల్‌
సాయంత్రం 5:05 నుంచి అథ్లెటిక్స్‌ మహిళల హ్యామర్‌ త్రో ఫైనల్‌
సాయంత్రం 5:55 నుంచి అథ్లెటిక్స్‌ మహిళల 800 మీ. పరుగు ఫైనల్‌
సాయంత్రం 6:20 నుంచి అథ్లెటిక్స్‌ మహిళల 200 మీ. పరుగు ఫైనల్‌

మరిన్ని వార్తలు