Dutee-Chand: డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్‌.. తాత్కాలిక నిషేధం

18 Jan, 2023 15:28 IST|Sakshi

భారత టాప్‌ అథ్లెట్‌ క్రీడాకారిణి ద్యుతీచంద్‌ డోపింగ్‌ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్‌- ఏ టెస్టు రిజల్ట్‌ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్‌(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్‌ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

''ద్యుతీ శరీరంలో సార్స్‌ ఎస్‌-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్‌, సార్మ్స్‌ (ఎన్‌బోర్సమ్‌), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్‌ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్‌-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది.

ఇక గతేడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్‌ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది.

చదవండి: Australian Open: బిగ్‌షాక్‌.. రఫేల్‌ నాదల్‌ ఓటమి

మరిన్ని వార్తలు