మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్‌ ప్లేయర్స్‌పై నిషేధం 

1 Sep, 2022 16:34 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ లాంటి కీలకమైన ఈవెంట్‌లో మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్‌ సుల్తానా సోమా, సాదియా అక్తర్‌ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్‌ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో ఆగస్ట్‌ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్‌ల్లో (సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సడ్‌ డబుల్స్‌)  పాల్గొనాల్సి ఉండింది. 

అయితే ఈ జోడీ క్యాంప్‌ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్‌ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్‌ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్‌ సర్క్యూట్‌కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.  
చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!

మరిన్ని వార్తలు