సాయ్‌(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్‌

1 Sep, 2022 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీనేజ్‌ అథ్లెట్‌తో సాయ్‌(SAI) మహిళా అధికారి మసాజ్‌ చేయించుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్‌ అనే మహిళ ధార్‌లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్‌లో ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది. సాయ్‌ సెంటర్‌కు వచ్చే టీనేజ్‌ అథ్లెట్స్‌ను షర్మిలా తేజావత్‌ తరచూ  తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్‌ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్‌ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది.

తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్‌లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్‌ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్‌ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. 

ఈ ఘటనపై సాయ్‌ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్‌ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్‌కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్‌గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్‌లోని జెట్‌పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు.

చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!

మరిన్ని వార్తలు