రెండు రన్స్‌తో డబుల్‌ సెంచరీ మిస్‌.. కేకేఆర్‌లో జోష్‌

28 Feb, 2021 17:14 IST|Sakshi

ఇండోర్‌: దేశవాళీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోపీలో బ్యాట్స్‌మెన్‌ పరగుల వరద పారిస్తున్నారు.ఈ టోర్నీలో పలువురు దేశవాళీ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నారు. ఐపీఎల్‌కు సెలక్ట్‌ అయ్యామన్న ఆనందమేమో కానీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతూ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నారు. మొన్న ఇషాన్‌ కిషన్‌ సిక్సర్లతో వీరవిహారం చేయగా.. తాజాగా వెంకటేశ్‌ అయ్యర్‌ సునామీ సృష్టించాడు. 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులతో విధ్వంసం సృష్టించిన అయ్యర్‌ కేవలం రెండు పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

ఆదివారం గ్రూఫ్‌-బిలో భాగంగా మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. మొదట మధ్యప్రదేశ్‌ బ్యాటింగ్‌ చేయగా, ఆ జట్టు ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపులతో 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయ్యర్‌కు ఆదిత్య శ్రీ వాత్సవ 84* పరుగులు,రాజత్‌ పాటిదార్‌ 54 సహకరించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 2.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(104 పరుగులు) సెంచరీతో మెరవగా.. మిగతావారు విఫలమయ్యారు. అయితే  అయ్యర్‌ డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నందుకు బాధగా ఉన్నా కేకేఆర్‌ మాత్రం అతని ఇన్నింగ్స్‌తో మంచి జోష్‌లో ఉంది. ఎందుకంటే వెంకటేశ్‌ అయ్యర్‌ను ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో రూ. 20లక్షలతో కొనుగోలు చేసింది. ఈ జోష్‌తో కేకేఆర్‌ అతని ఇన్నింగ్స్‌ను మెచ్చకుంటూ అతని ఇన్నింగ్స్‌తో పాటు ఫోటోను షేర్‌ చేస్తూ కంగ్రాట్స్‌ తెలిపింది. 
చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ మరో సెంచరీ

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు