షాకింగ్‌ న్యూస్‌: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..?

22 Jun, 2022 12:01 IST|Sakshi

టీమిండియా అభిమానులకు చేదు వార్త. రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. కోహ్లి లండన్‌లో ల్యాండయ్యాక షాపింగ్‌ అంటూ వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు పోజులిచ్చాడు. అక్కడే అతను కోవిడ్‌ బారిన పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరక ముందు మాల్దీవ్స్‌లో హాలీడేస్‌ ఎంజాయ్‌ చేశాడు.

కోహ్లి కొద్ది రోజులగా జట్టు సహచరులతో క్లోజ్‌గా ఉండటంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ప్రాక్టీస్‌ సందర్భంగా కోహ్లి టీమ్‌ మేట్స్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. కోహ్లి కోవిడ్‌ బారిన పడ్డాడన్న వార్త నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్ట్‌ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. కాగా, టీమిండియా ఇంగ్లండ్‌కు బయల్దేరడానికి ముందు స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, కోవిడ్‌ కారణంగా గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టీమిండియా పోరు.. పూర్తి షెడ్యూల్‌, ‘జట్టు’ వివరాలు!

మరిన్ని వార్తలు