Happy Birthday Ajinkya Rahane: తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’!

6 Jun, 2022 14:02 IST|Sakshi

Happy Birthday Ajinkya Rahane: టీమిండియా బ్యాటర్‌ అజింక్య రహానే సోమవారం 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానే.. ఆస్ట్రేలియా పర్యటనలో.. కోహ్లి గైర్హాజరీలో క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ను గెలిపించిన తీరును ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

నాడు అవమానకర ఓటమి నుంచి పడిలేచిన కెరటంలా!
గతేడాది(2020-21) ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను మట్టికరిపించి 2-1 తేడాతో గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అడిలైడ్‌ పింక్‌బాల్‌ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్‌ అయి తీవ్ర విమర్శల పాలైన భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది.

పితృత్వ సెలవు కోసం అప్పటి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి పయమనమ్యాడు. అదే సమయంలో కీలక బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ గాయాల బారిన పడి జట్టు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మెల్‌బోర్న్‌ టెస్టు నేపథ్యంలో సారథిగా బాధ్యతలు చేపట్టిన రహానే.. రహానే జట్టును ముందుకు నడిపించాడు. 

అతడి కెప్టెన్సీలో టీమిండియా మెల్‌బోర్న్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం సమా సిడ్నీ టెస్టును డ్రా చేసుకుంది. అంతేగాక నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది. కాగా ఈ చారిత్రక విజయం త్వరలోనే బిగ్‌స్క్రీన్‌పై డాక్యుమెంట్‌ రూపంలో కనువిందు చేయనుంది.

తక్కువగా అంచనా వేశారు.. కానీ
ఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రహానెను కొనియాడుతూ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘‘తక్కువగా అంచనా వేయబడ్డ ఎంతో మంది క్రికెటర్లలో తనూ ఒకడు. విదేశంలో టెస్టు సిరీస్‌ గెలిచి భారత్‌ను ముందుకు నడిపిన సారథి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అజింక్య రహానే. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఆ దేవుడు నీకు శక్తినివ్వాలి’’ అని ట్వీట్‌ చేశాడు. 

ఇక రహానే సహచర ఆటగాడు, నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా.. ‘‘హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌.. నీకు మరిన్ని విజయాలు లభించాలి’’ అని ఆకాంక్షించాడు. అదే విధంగా బీసీసీఐ.. ‘‘192 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 8268 అంతర్జాతీయ పరుగులు.. రహానేకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలిపింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ, మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా రహానేను విష్‌ చేశారు.

చదవండి👉🏾Joe Root: వామ్మో.. ఇదేంటి? రూట్‌ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్‌!
చదవండి👉🏾Kohli- Rohit- Rahul: పేరు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు ఆడాలి: భారత దిగ్గజం ఘాటు విమర్శలు

మరిన్ని వార్తలు