IND Vs AUS T20 Series 2023: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా యువ ఓపెనర్‌!

6 Nov, 2023 15:30 IST|Sakshi
భారత జట్టు(ఫైల్‌ ఫోటో)

వన్డే ప్రపంచకప్‌-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌ కోస​​ం భారత జట్టును మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్‌కే స్టార్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ భారత జట్టు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. రుత్‌రాజ్‌ కెప్టెన్‌గా ఇప్పటికే చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో భారత్‌కు గోల్డ్‌మెడల్‌ అందించాడు. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్‌, జితేష్‌ శర్మ, తిలక్‌ వర్మ వంటి యువ ఆటగాళ్లు ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కూడా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరోవైపు దేశీవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న అస్సాం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ను పేరును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ సిరీస్‌ నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరగనుంది. నవంబర్‌ 23న ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, రియాన్ పరాగ్, జితేష్ శర్మ , శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా , అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ , యుజ్వేంద్ర చాహల్
చదవండి: WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్‌ బోర్డు రద్దు! ఇకపై..

మరిన్ని వార్తలు