బౌండరీ లోపలే క్యాచ్‌ పట్టాడు.. అయినా సిక్స్‌ ఇచ్చారు

22 Sep, 2021 19:44 IST|Sakshi

లండన్‌: విటాలిటీ బ్లాస్ట్‌ క్రికెట్‌లో భాగంగా సోమర్‌సెట్‌‌, కెంట్‌ మధ్య జరిగిన టి20 ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సోమర్‌సెట్‌ బ్యాట్స్‌మన్‌ డీప్‌ స్వేర్‌లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు.కెంట్‌ ఫీల్డర్లు జోర్డాన్‌ కాక్స్‌, డేనియల్‌ బెల్‌లు మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల క్యాచ్‌ తీసుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. కాక్స్‌ క్యాచ్‌ పట్టాడు.. అయితే బెల్‌ అప్పటికే బౌండరీ లైన్‌ను తాకుతూ వెళ్లాడు.. అతనితో కాక్స్‌ కూడా తగిలాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్స్‌ తమ నిర్ణయంపై క్లారిటీ లేక థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో థర్డ్‌ అంపైర్‌ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యవహరించాడు. అతను ఔట్‌ కాదంటూ సిక్స్‌ ఇచ్చేశాడు. క్లుప్తంగా ఇది జరిగింది.  

చదవండి: ఇకపై బ్యాట్స్‌మన్ కాదు.. బ్యాట‌ర్‌.. క్రికెట్ రూల్స్‌లో కీల‌క మార్పు

ఇక ఒక బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతిని ఫీల్డర్‌ బౌండరీ రోప్‌కు తాకుకుండా పట్టకుంటే క్లియర్‌ అవుట్‌ అని అందరికి తెలిసిందే. ఒకవేళ బౌండరీ రోప్‌ తాకితే ఔట్‌ ఇవ్వకుండా సిక్సర్‌ ఇవ్వడం క్రికెట్‌ పుస్తకాల్లో ఆనవాయితీ. మరి ఒక ఫీల్డర్‌ సేఫ్‌గా క్యాచ్‌ పట్టినప్పటికి మరో ఫీల్డర్‌ వచ్చి బౌండరీ లైన్‌ తాకడం.. అదే సమయంలో క్యాచ్‌ పట్టిన ఆటగాడిని ముట్టుకుంటే ఔట్‌ ఇస్తారా లేక బౌండరీ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. అది కచ్చితంగా ఔటేనని కొందరు అభిప్రాయపడితే.. కాదు అని మరికొందరు అడ్డు తగిలారు.

చదవండి: IPL 2021: మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్‌ కూడా రద్దు చేస్తారా!

క్రికెట్‌ పుస్తకాల్లో.. 19.5.1 లా ప్రకారం ఒక ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ అందుకునే క్రమంలో మరో ఫీల్డర్‌కు అనుకోకుండా తగిలితే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గానే పరిగణిస్తారు.. కానీ ఆ నిర్ణయం ఫీల్డ్‌ అంపైర్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇక్కడ ఇద్దరు కావాలని తగిలినట్లు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకోకుండా థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. థర్డ్‌ అంపైర్‌ ఏ నిర్ణయం ఇచ్చినా ఫీల్డ్‌ అంపైర్‌ పాటించాలా వద్దా అన్నది అతనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయమే తన నిర్ణయమని ఫీల్డ్‌ అంపైర్‌ అనుకున్నాడు. అందుకే సోమర్‌సెట్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెంట్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం సోమర్‌సెట్‌ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై 25 పరుగులతో పరాజయం పాలైంది. 

మరిన్ని వార్తలు