-
విశాఖలో అమెరికా యుద్ధనౌక సోమర్సెట్..
-
USS Somerset Crew Photos: విశాఖలో అమెరికా నౌక (ఫొటోలు)
-
విశాఖ పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
విశాఖపట్నం: టైగర్ ట్రయంఫ్లో భాగంగా తమ విశాఖపట్నం పర్యటనను, భారత నౌకాదళంతో సంయుక్తంగా జరిపిన విన్యాసాల గొప్ప అనుభవాన్ని తాము ప్పటికీ గుర్తుంచుకుంటామని యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక సిబ్బంది పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టులో శనివారం మీడియాతో మాట్లాడారు. యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక గురించి వివరించారు. డజన్ల కొద్దీ సైనిక వాహనాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఓడలో 1,000 మందికి పైగా నావికులు, మెరైన్లు ప్రయాణిస్తారని, పడవలను రిపేర్ చేసే వర్క్‌షాప్‌తో పాటు ఫ్లైట్ డెక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయని షిప్ పైలట్ ఆష్లే అంబుహెల్ తెలిపారు. “విశాఖపట్నంలో భారత నౌకాదళ సిబ్బందితో గడపడం ఆనందంగా ఉంది. మేము వారి నుండి చాలా నేర్చుకున్నాం. మంచి జ్ఞాపకాలు పొందాం” అని సోమర్సెట్లోని సర్ఫేస్ వార్ఫేర్ ఆఫీసర్ బ్రన్జిక్ చెప్పారు. -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్‌స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
టీ20 బ్లాస్ట్ 2023 విజేత సోమర్సెట్.. ఫైనల్లో ఎసెక్స్‌పై గెలుపు
2023 సీజన్ టీ20 బ్లాస్ట్ విజేతగా సోమర్సెట్ జట్టు నిలిచింది. నిన్న (జులై 15) జరిగిన ఫైనల్లో సోమర్సెట్.. ఎసెక్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ఎసెక్స్ 18.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సోమర్సెట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4/25), ఐష్ సోధి (3/22), లెవిస్ గ్రెగరీ (2/25), క్రెయిగ్ ఓవర్టన్ (1/30) ఎసెక్స్ పతనాన్ని శాశించారు. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ సామ్స్ (45), ఆడమ్ రోసింగ్టన్ (19), డేనియల్ లారెన్స్ (16), పాల్ వాల్టర్ (26) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు సీన్ డిక్సన్ (53) రాణించడంతో సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (20), కోహ్లెర్ క్యాడ్మోర్ (19), గ్రెగరీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఎసెక్స్ బౌలర్లలో స్నేటర్, పాల్ వాల్టర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, క్రిచ్లీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
నేడు నీట్ యూజీ
జగన్ సీఎం అయితేనే మళ్లీ పథకాలు
పచ్చ కుతంత్రం
రూ.1.10 లక్షల నగదు సీజ్
జగనన్నే నా నమ్మకం..నా ధైర్యం!
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలి
చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగినట్లే
ఈవీఎంల ఎఫ్ఎల్సీ పూర్తి
జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement