WC 2023: గ్రీన్‌ అవుట్‌.. ట్రవిస్‌ హెడ్‌ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్‌

28 Oct, 2023 10:26 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ ధర్మశాల వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగినట్లు కివీస్‌ సారథి టామ్‌ లాథమ్‌ తెలిపాడు. మార్క్‌ చాప్‌మన్‌ పిక్కల్లో నొప్పితో దూరంకాగా.. అతడి స్థానంలో జిమ్మీ నీషం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.

అదే విధంగా ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుంది. మేము టాస్‌ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఈ మ్యాచ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ స్థానంలో ట్రవిస్‌ హెడ్‌ తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

ఇక కివీస్‌తో పోరు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుందన్న కమిన్స్‌.. ‘‘వాళ్లేంటో మాకు తెలుసు.. మేమేంటో వాళ్లకు కూడా బాగానే తెలుసు. భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. మూడు గెలుపొందిన ఆసీస్‌ నాలుగో స్థానంలో ఉంది.

తుదిజట్లు:
న్యూజిలాండ్‌:

డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/ వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్‌.

మరిన్ని వార్తలు