రేవంత్‌కు కొత్త టెన్షన్‌.. 19 స్థానాల్లో ఎవరు? | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు కొత్త టెన్షన్‌.. 19 స్థానాల్లో ఎవరు?

Published Sat, Oct 28 2023 10:24 AM

Telangana Congress Tension Over Selection Of 19 Seats Candidates - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 55 మంది పేరు, రెండో జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక, మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎటూ తేల్చలేకపోతున్నట్టు తెలుస్తోంది. 

కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. మరోవైపు.. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో టికెట్‌ దక్కని వారు ఆశావహులు హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొ​ంత మంది నేతలు పార్టీని సైతం వీడటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ కోసం దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేట టికెట్‌పై ఇక తాను చేసేదేమీ లేదన్న పటేల్ రమేష్ రెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగిస్తున్నట్టు సమాచారం. దీంతో, సూర్యాపేట టికెట్‌ నిర్ణయం రాహుల్‌ కోర్టులోకి వెళ్లింది. ఇక, సూర్యాపేటతో పాటుగా తుంగతుర్తి టికెట్‌ను కూడా అధిష్టానం డిసైడ్‌ చేయనుంది. మరోవైపు.. ఇల్లెందు, డోర్నకల్‌, చెన్నూరు సహా పలు సీట్లపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

కీలక 19 స్థానాలు ఇవే..
1. సూర్యపేట : దామోదర్ రెడ్డి vs పటేల్ రమేష్ రెడ్డి
2. తుంగతుర్తి : అద్దంకి దయాకర్ vs డాక్టర్ వడ్డేపల్లి రవి
3. మిర్యాలగూడ : సీపీఎం
4. చెన్నూరు: సీపీఐ 
5. చార్మినార్: అలీ మస్కతి
6. నిజామాబాద్ అర్బన్: ధర్మపురి సంజయ్/మహేష్ కుమార్ గౌడ్ / షబ్బీర్ అలీ
7. కామారెడ్డి : రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం
8. సిరిసిల్ల : ఉత్తంకుమార్ రెడ్డి పోటీచేసే అవకాశం
9.  వైరా : సీపీఎంకు కేటాయించే అవకాశం
10. కొత్తగూడెం: సీపీఐ
11. బాన్సువాడ : కాసుల బాలరాజు గౌడ్ / ఏనుగు రవీందర్ రెడ్డి
12. జుక్కల్: గంగారాం / తోట లక్ష్మి కాంత రావు
13. పఠాన్ చెరువు: నీలం మధు/ కాట శ్రీనివాస్ గౌడ్
14. కరీంనగర్‌: సంతోష్ కుమార్/పురుమల్ల శ్రీనివాస్/కొత్త జైపాల్ రెడ్డి
15. ఇల్లందు: కోరం కనకయ్య / శంకర్ నాయక్/డాక్టర్ రవి
16. డోర్నకల్: రామ్ చంద్ర నాయక్
17. సత్తుపల్లి: మట్టా రాగమయి/మానవతా రాయ్
18.నారాయణ్ ఖేడ్ : సురేష్ షెట్కర్/ సంజీవ రెడ్డి
19 అశ్వారావుపేట: తాటి వెంకటేశ్వర్లు / జారె ఆదినారాయణ

రెండో జాబితాలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు వీరే..
జడ్చర్ల లేదంటే నారాయణ పేట్ టిక్కెట్ ఆశించిన ఎర్ర శేఖర్
ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశించిన సుభాష్ రెడ్డి.
నర్సాపూర్ టిక్కెట్ ఆశించిన గాలి అనీల్
హుజురాబాద్ టిక్కెట్ ఆశించిన బల్మూరి వెంకట్
హుస్నాబాద్ టిక్కెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి.
మహబూబాబాద్ టిక్కెట్ ఆశించిన బలరాం నాయక్, బెల్లయ్య నాయక్.
పాలకుర్తి టిక్కెట్ ఆశించిన తిరుపతిరెడ్డి..
జూబ్లీహిల్స్ టిక్కెట్ ఆశించిన విష్ణువర్దన్ రెడ్డి.
అంబర్ పేట్ టిక్కెట్ ఆశించిన నూతి శ్రీకాంత్, మోతె రోహిత్.
మహేశ్వరం  టిక్కెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి.
దేవరకొండ టిక్కెట్ ఆశించిన వడ్త్యా రమేష్ నాయక్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలకు పెద్దపీట

Advertisement
Advertisement