IND vs ZIM: 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!

23 Aug, 2022 21:53 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌, భారత్‌తో జరిగిన సిరీస్‌లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది.

చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్‌-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్‌లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

కాగా ఈ సిరీస్‌ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్‌విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది.

జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా
చదవండి:
 IND vs PAK: 'రోహిత్‌, రాహుల్‌, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే'

మరిన్ని వార్తలు