అనసూయ చూసేందుకు వేలాదిగా జనం 

18 Mar, 2023 02:42 IST|Sakshi

  ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్‌ అనసూయ శుక్రవారం పలాస–కాశీబుగ్గలో సందడి చేశారు. ఇక్కడి కేటీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్‌ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు వేలాదిగా జనం తరలిరావడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది. తనకు పలాస రావాలని ఎప్పటి నుంచో ఉందని, లక్కీ షాపింగ్‌ మాల్‌ వారి వల్ల ఆ కోరిక నెరవేరిందన్నారు. మంచి ధరల్లో నాణ్యమైన వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని లక్కీ షాపింగ్‌ మాల్‌ ముగ్గురు డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, ఎస్‌.రత్తయ్య, జి.సోమయ్యలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు భార్య సీదిరి శ్రీదేవి, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం, మున్సిపల్‌ చైర్మన్‌ గిరిబాబు, నాయకులు బోర బుజ్జి, మీసాల సురేష్‌బాబు, భవనం యాజమా న్యం కోరాడ శ్రీనివాస్‌, సంతోష్‌కుమార్‌, రవికుమార్‌, పివి సతీష్‌, మల్లా సురేష్‌, లొడ గల కామేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు