కోడలిని కర్కశంగా హత్య చేసిన అత్తమామలు

11 Nov, 2023 11:08 IST|Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: ఇల్లాలిని కూతురిలా చూసుకోవాల్సిన అత్తమామలు ఆమె పాలిట కాలయములయ్యారు. కోడలిని కర్కశంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించారు. నెల రోజులుగా ఎవరికి దొరి కిపోతామో అని భయపడుతూ చివరకు పోలీసులకు లొంగిపోయా రు. వివరాల్లోకి వెళితే..

ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన నీలాపు మీనాకుమారి(22) ఈ ఏడాది అక్టోబర్‌ 7న ఇంటిలోనే ఉరి వేసుకొని మృతి చెందినట్లు అత్తమామలు నీలాపు అన్నపూర్ణ, జగ్గారావులు పోలీసులకు తెలిపారు. అయితే అప్ప ట్లో మీనాకుమారి తల్లి మోహిని తన కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆ మేరకు పోలీసులు కూడా కేసు నమో దు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు జరుగుతుండగానే అత్తమామలు గురువారం పోలీసులఎదుట లొంగిపోయారు. తామే చంపేశామని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సీఐ ఆర్‌.ఈశ్వర చంద్రప్రసాద్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మృతురాలు మీనాకుమారి భర్త మోహనబాబు ఏడు నెలల కిందట పోలెండ్‌ దేశానికి ఉపాధి కోసం వెళ్లిపోయాడని, అప్పటి నుంచి మీనాకుమారితో అత్తమామలకు గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌ 8న సాయంత్రం మరోమారు గొడవ జరగడంతో మామ జగ్గారావు కర్రతో మీనాకుమారి తలపై బలంగా కొట్టడంతో ఆమె పడిపోయిందని, మళ్లీ లేచాక మరోసారి గొడవ పడడంతో అత్తమామలు కలిపి పీక నులిమి చంపేశారని వివరించారు.

ఈ విషయాన్ని పక్కింటికి చెందిన నీలాపు హేమారావుకు చెప్పడంతో ఆయన సాక్ష్యాలను తారుమారు చేశాడని, రక్తపు మరకల్ని తుడిచేసి, మృతురాలి ఒంటిపై ఉన్న పంజాబీ డ్రస్సును తొలగించి నైటీలోకి మార్చి మంచంపై పడుకోబెట్టి ఉరిపోసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు, మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఇది హత్యగా తేలి పోతుందని, తాము దొరికిపోతామని భయపడిన అత్తమామలు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. వారిని సోంపేట కోర్టుకు తీసుకువెళ్లి అక్కడ నుంచి శ్రీకాకుళం తరలిస్తున్నామని తెలిపారు. సమావేశంలో రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ కె.గోవిందరావు, హెచ్‌సీ వై.రమణ, కానిస్టేబుల్‌ కిరణ్‌, అనూష, కనకమ్మ, రామరావులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు