క్రిమినల్‌కు గుమ్మడికాయ కొట్టారు

20 Mar, 2023 01:56 IST|Sakshi
క్రిమినల్‌ చిత్ర యూనిట్‌

తమిళ సినిమా: నటుడు గౌతమ్‌ కార్తీక్‌, కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం క్రిమినల్‌. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ చిత్రం ఇది. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ ఐబీ.కార్తీకేయన్‌ తో కలిసి పీఆర్‌. మీనాక్షి సుందరం నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా దక్షిణామూర్తి రామర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ ఈ ఏడాది జనవరి 23వ తేదీన షూటింగ్‌ ప్రారంభించామని చెప్పారు. ప్రణాళిక ప్రకారం షూటింగులు దర్శకుడు పూర్తి చేయటం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు దక్షిణామూర్తి రామర్‌ స్టార్‌ నటినటులతో చక్కగా పని చేయించుకుని చిత్రాన్ని అద్భుతంగా తరకెక్కించారని, ఆయన ప్రతిభ ప్రశంసనీయం అన్నారు. నటుడు గౌతమ్‌ కార్తీక్‌ కుమార్‌ ఈ చిత్రానికి ఎంతగానో సహకరించారని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొ న్నారు. వారితో చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ అదే విధంగా చిత్రం విడుదల తేదీలను త్వరలోనే అధికారిక పూర్వకంగా ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. కాగా దీనికి శ్యామ్‌.సియస్‌ సంగీతాన్ని, స్నేహన్‌ పాటలను, ప్రసన్న ఎస్‌ కుమార్‌ చాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు.

>
మరిన్ని వార్తలు