వృషభ వాహనంపై.. అరుణాచలేశ్వరుడు

22 Nov, 2023 00:38 IST|Sakshi
మూషిక వాహనంపై ఊరేగుతున్న వినాయకుడు

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన మంగళవారం ఉదయం చంద్రశేఖరుడు అద్దాల పెద్ద వెండి వృషభ వాహనంపై విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక దీపోత్సవాలు ఈ నెల 17వ తేదిన ధ్వజారోహణంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివార్లు వివిధ వాహనాల్లో భక్తులకు మాడ వీధుల్లో దర్శన మిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చంద్రశేఖర స్వామిని విశేషంగా అలంకరించి అతిపెద్ద వాహనమైన అద్దాల వెండి వృషభ వాహనంలో కొలువు దీర్చారు. అనంతరం స్వామి వార్లును మాడ వీధుల్లో భక్తుల దర్శరార్థం ఊరేగించారు. అనంతరం వందేళ్ళు చరిత్ర కలిగిన 32 అడుగుల ఎత్తుయిన పెద్ద రథానికి కలశం ఉన్న గొడుగును ధరింపజేశారు. సాయంత్రం 6 గంటలకు పెద్ద వృషభ వాహనంలో శివుడి చిహ్నంగా ఉన్న గుడ్డతో గొడుగు కప్పి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పంచమూర్తులకు ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేపట్టారు. అనంతరం మాడ వీధుల్లో ఊరేగించారు. నెయ్యి కానుకలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఈనెల 26న ఆలయం వెనుక వైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తుగల మహాకొండపై సాయంత్రం 6 గంటలకు మహాదీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం గాడ గుడ్డతో పాటు నెయ్యిని ఉపయోగించి దీపాన్ని వెలిగించనున్నారు. ఇప్పటికే అవసరమైన నెయ్యిని ఆవీన్‌ పాల డెయిరీ నుంచి కొనుగోలు చేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి నెయ్యి కానుకలను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు మంగళవారం వెల్లడించారు.

మరిన్ని వార్తలు