Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?

26 Feb, 2023 19:05 IST|Sakshi

లవర్స్ అంటేనే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో గడిపేస్తారు. దూరంగా వున్న లవర్స్ అయితే రోజూ ఫోన్‌లో మాట్లాడుకోవడంతో సరిపోతుంది. ఇప్పుడు అలాంటి లవర్స్ కోసం కిస్సింగ్ డివైజ్‍ అనే కొత్త పరికరం పుట్టుకొచ్చింది.

చైనాకు చెందిన 'జియాంగ్ జోంగ్లీ' కిస్సింగ్ డివైజ్‍ కనుగొన్నాడు. వర్చువల్‍గా రొమాన్స్ చేసుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. లాంగ్ డిస్టెన్స్ కపుల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్ ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. 

ఈ డివైజ్ సిలికాన్‍తో తయారు చేసిన పెదాలను కలిగి ఉండటం వల్ల రియల్ కిస్ ఫీలింగ్‍ అందిస్తాయని చైనాలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని కోసం ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లు ఇందులో అమర్చబడి ఉన్నాయి. ఈ డివైజ్ పనిచేయాలంటే తప్పకుండా యాప్ ఉండాలి.

యాప్ డౌన్‍లోడ్ చేసుకుని మొబైల్ ఛార్జింగ్ పోర్టుకి ఈ డివైజ్ కనెక్ట్ చేయాలి. ఈ తరువాత వీడియో కాల్ చేసి పార్ట్‌నర్‌ డివైజ్‍కు కిస్‍లను పంపవచ్చు. ఇది నిజ అనుభూతిని అందిస్తుందని చైనాలోని కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి డివైజెస్ అసభ్యకరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరికరాలు పిల్లల జీవితాలమీద ప్రభావం చూపుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు