వీడియో: హైదరాబాద్‌లో ‘హిజాబ్‌’ ఘటన..  హోంమంత్రి కామెంట్లపై దుమారం

17 Jun, 2023 16:49 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలో హిజాబ్‌ దుమారం రేగింది. శుక్రవారం సైదాబాద్‌ కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఉర్దూ పరీక్ష రాయడానికి వెళ్లిన కొంతమంది విద్యార్థినులను హిజాబ్‌ తొలగించాలని కాలేజీ యాజమాన్యం పట్టుబట్టింది. 

ఊహించని  ఆ పరిణామంతో కొందరు గందగోళానికి గురయ్యారు. పరీక్షకు గంటకు పైగా ఆలస్యంగా అటెండ్‌ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఆందోళనతో అప్పటికప్పుడు బుర్జాలు తొలగించి పరీక్ష రాశారు. ఆపై విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు హోం మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు.  

ఈ ఘటనను ఆయన ఖండించారు.  ఉన్నతస్థాయిలో ఉన్న ఎవరైనా అక్కడ అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. లౌకికవాద సిద్ధాంతం తమదని, ప్రజలు వాళ్లకు నచ్చింది ధరించొచ్చని ఆయన అన్నారు. అలాగే..  ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారాయన. అయితే.. 

ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. ‘‘ఒకవేళ మోడ్రన్‌ దుస్తులు ధరిస్తే.. అది ఏమాత్రం కరెక్ట్‌ కాదు. మనం మంచి దుస్తులు ధరించాలి. ముఖ్యంగా మహిళలు. ఒకవేళ మహిళలు గనుక కురుచ దుస్తులు ధరిస్తే.. అది సమస్యగా మారొచ్చు. నిండైన దుస్తులు ధరిస్తేనే ఏ సమస్యా ఉండదు అని మహమూద్ అలీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు