-

ఎన్నికల వేళ.. ఖమ్మం, పెద్దపల్లిలో రూ.11 కోట్లు పట్టివేత

27 Nov, 2023 12:13 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. రేపటితో(నవంబర్‌ 28) ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుండటంతో అన్నీ పార్టీల నేతలు సభలు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. 

గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకుకైనా ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్దమయ్యారు. ఇందుకోసం భారీ నగదును సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో  ఐటీ, రాష్ట్ర పోలీసులు, ఈసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో మొత్తం రూ. 11 కోట్లకు పైగా  నగదుపట్టుబడింది. 

ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. జిల్లా ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో చేపట్టినతనిఖీల్లో రూ, 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు, ఐటీ, ఈసీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు.  కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెందిన డబ్బుగా అధికారులు భావిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 కోట్ల 18 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కాంగ్రెస్‌ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్‌ చేశారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు.
చదవండి: ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్‌పై కిషన్‌ రెడ్డి ఫైర్‌

మరిన్ని వార్తలు