రైతుబంధుకు ఈసీ బ్రేక్‌.. మంత్రి హరీశ్‌రావు మాటలతోనే? | EC Says Harishrao Comments Is Reason For Rythu Bandhu Break Ahead Of Assembly Elections 2023 - Sakshi
Sakshi News home page

రైతుబంధుకు ఈసీ బ్రేక్‌.. మంత్రి హరీశ్‌రావు మాటలతోనే?

Published Mon, Nov 27 2023 10:35 AM

EC Says Harishrao Comments Is Reason For Rythu Bandhu Break - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడించింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్‌ రావు వల్లే రైతుబంధుకు బ్రేక్‌ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అయితే, ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. 

ఇదిలాఉండగా.. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది. కాగా ప్రతీ, ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సహయాన్ని అందిస్తుంది. 

Advertisement
Advertisement