కేసులు 1.99 లక్షలు.. రికవరీ 1.70 లక్షలు 

5 Oct, 2020 05:13 IST|Sakshi

మరణాలు 1,163.. యాక్టివ్‌ కరోనా కేసులు 27,901

తాజాగా 1,949 కేసులు.. మరో 10 మంది మృతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 32,05,249 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,99,276 మందికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం బులెటిన్‌లో వెల్లడించారు. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,70,212. అంటే రాష్ట్రంలో రికవరీ రేటు 85.41 శాతముంది. ఇటు కరోనాతో 1,163 మంది చనిపోయారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.58 శాతముంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 27,901 ఉండగా, అందులో 22,816 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 86,116 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.  రాష్ట్రంలో శనివారం 51,623 టెస్టులు నిర్వహించగా, 1,949 కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు బులెటిన్‌లో తెలిపారు. ఒక్కరోజులో 2,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 10 మంది మృతి చెందారు. ఇక తాజా కరోనా పరీక్షల్లో 22,714 (44%) మంది ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు కాగా, 6,194 (12%) మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులున్నారు. మిగిలినవారు డైరెక్ట్‌ కాంటాక్టు వ్యక్తులు.. రాష్ట్రంలో 231 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు నిర్వహిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 291, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్‌ జిల్లాలో 150, నల్లగొండ జిల్లాలో 124, కరీంనగర్‌ జిల్లాలో 114 ఉన్నాయి.    

మరిన్ని వార్తలు