ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఏల ధర్నా 

30 Dec, 2022 01:46 IST|Sakshi
కోఠి డీఎంహెచ్‌ఎస్‌లో  ధర్నా నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు  

సుల్తాన్‌బజార్‌(హైదరాబాద్‌): కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ, ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం కోఠి డీఎంహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో ఏఎన్‌ఎంలు పెద్దఎత్తున ఆందోళన చేశారు.

సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సంఘం ప్రధానకార్యదర్శి యాదనాయక్‌ మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఏలు పని ఒత్తడికి గురవుతున్నారని, వారి పనిభారాన్ని తగ్గించాలని అన్నారు. జాబ్‌చార్ట్‌ ప్రకారం పనిచేయించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేయొద్దని కోరారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌(ఎఫ్‌)ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. బదిలీలు, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు